ETV Bharat / bharat

బంగాల్​లో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూలీ భార్య

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాల్తోరా నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ఓ కూలీ భార్యను బరిలో నిలిపింది భాజపా. మరుగుదొడ్డి వసతి కూడా లేని ఇంట్లో ఉండే ఆమె.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సాల్తోరా ఎస్సీ రిజర్వుడు స్థానం. గత రెండు దఫాలూ ఇక్కడ తృణమూల్ అభ్యర్థి స్వపన్​ బరూయి విజయం సాధించారు.

bjp has given   mla ticket to labour's wife for upcoming elections in bengal
బంగాల్​లో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూలీ భార్య
author img

By

Published : Mar 19, 2021, 6:36 AM IST

Updated : Mar 19, 2021, 7:09 AM IST

మూడు మేకలు.. మూడు ఆవులు.. మట్టిగోడల ఇళ్లు.. ఇవీ బంగాల్​లోని సాల్తోరా నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో దిగిన అభ్యర్థి ఆస్తులు! మరుగుదొడ్డి వసతి కూడా లేని ఇంట్లో ఉండే ఆమె.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సాల్తోరా ఎస్సీ రిజర్వుడు స్థానం. గత రెండు దఫాలూ ఇక్కడ తృణమూల్ అభ్యర్థి స్వపన్​ బరూయి విజయం సాధించారు. ఈ దఫా ఆ పార్టీ అభ్యర్థిని మార్చింది. సంతోష్​ కుమార్​ మండల్​ అనే నేతను బరిలో దించింది.

భాజపా.. 30 ఏళ్ల చందనా బౌరిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె భర్త శ్రవణ్​ కూలీ. తాపీ పని చేస్తూ.. రోజుకు రూ. 400 సంపాదిస్తుంటారు. అప్పుడప్పుడూ చందన కూడా భర్తతో కలిసి పనికి వెళ్తుంటారు. ఆమె 12వ తరగతిలోనే చదువు ఆపేశారు.

ఇదీ చదవండి: 'బంగాల్​ ఎన్నికల్లో నెగ్గాక.. దిల్లీలో మార్పు తెస్తాం'

Last Updated : Mar 19, 2021, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.