ETV Bharat / bharat

వినూత్నం: హాల్​టికెట్ లాంటి పెండ్లి​పత్రిక..!

జీవితమే ఓ అగ్నిపరీక్ష.. 'పెళ్లి' అనేది దానికి ఎంట్రెన్స్​ టెస్ట్​ లాంటిది. మరి పరీక్ష రాయాలంటే.. హాల్​టికెట్​ కావాలి కదా.. అందుకే ఏడడుగులు వేసి రాసే ముఖ్యమైన వివాహ పరీక్షకు హాల్​టికెట్​ను పోలిన పెండ్లి పత్రికను ముద్రించింది కర్ణాటకకు చెందిన ఓ జంట. అయితే, ఆ ప్రవేశ పత్రాలు కేవలం పరీక్ష రాసే వధూవరులకు మాత్రమే కాదు. వారి వివాహానికి వచ్చే బంధుమిత్రులకూ పంచేశారు! ఇంతకీ ఈ పెండ్లి హాల్​టికెట్ల కథేంటీ?

Wedding Card is in the form of Exam hall-ticket
వినూత్నం: హాల్​టికెట్ లాంటి పెండ్లి​పత్రిక..!
author img

By

Published : Feb 18, 2020, 9:47 AM IST

Updated : Mar 1, 2020, 4:59 PM IST

వినూత్నం: హాల్​టికెట్ లాంటి పెండ్లి​పత్రిక..!

కర్ణాటక బెళగావిలో ఓ జంట తమ పెండ్లిపత్రికను హాల్​టికెట్​ రూపంలో ముద్రించి.. అందరి దృష్టినీ ఆకట్టుకుంది. జమకండి తాలూకా సిరగుప్పి గ్రామానికి చెందిన బసవరాజ బిరదరా.. అత్తనీ తాలూకా హలాహల్లీకి చెందిన పార్వతీలు తమ వివాహ వేడుకలో విద్యార్థులకు కాస్త ధైర్యం చెప్పేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేశారు.

పరీక్షలంటే అనవసరంగా ఆందోళన చెందుతారు విద్యార్థులు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. భారత్​లో పరీక్షలు ఫెయిల్​​ అయిన విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అందుకే, వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే స్కూలు, కాలేజీ పరీక్షల పట్ల భయం పోగొట్టాలని నిర్ణయించుకున్నారు బసవరాజ, పార్వతీలు.

తమ వివాహ శుభలేఖను హాల్​టికెట్​ రూపంలో ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానించారు. జీవితంలో అన్ని పరీక్షలనూ ధైర్యంగా ఎదుర్కోవాలని సందేశాన్నిచ్చారు. సామాజిక దృక్పథంతో ముందడుగు వేసిన ఈ జంట.. సోమవారం ఒక్కటయింది.

"పెండ్లిపత్రిక ఇలా ముద్రించినందుకు కొందరు విమర్శించారు. కానీ, అవన్నీ మేము పట్టించుకోము. విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉండే భయాన్ని పొగట్టాలనేదే మా ఉద్దేశ్యం. అందుకే ఇలా ఓ అడుగు ముందుకేశాం."

-బసవరాజ బిరదరా, వరుడు

ఇదీ చదవండి:వెయ్యేళ్లనాటి పద్ధతితో వస్త్రాలపై ఆకర్షణీయ డిజైన్లు

Last Updated : Mar 1, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.