ETV Bharat / bharat

పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంటులోకి అనుమతి - వెంకయ్య నాయుడు

పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. నెగెటివ్​ వచ్చినవారికే పార్లమెంటు ఆవరణలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. కొవిడ్​-19 పరీక్షలను ఆయన శుక్రవారం చేయించుకున్నారు.

vice president venkaiah naidu went for  corona test ahead of parliament sessions
పరీక్షలు చేయించుకుంటేనే ఎంపీలకు పార్లమెంటులోకి అనుమతి
author img

By

Published : Sep 11, 2020, 3:37 PM IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ విధిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారినే పార్లమెంటు ఆవరణలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

పార్లమెంటు స్థాయీ సంఘం, ఇతర కమిటీల నివేదికలు, రోజు వారీ డాక్యుమెంట్లు కూడా ఎలక్ట్రానిక్ పద్దతిలోనే సర్క్యూలేట్ చేయనున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.