జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ ఉయదం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్‌లోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో.. భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి.
వీరి రాకను పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఫలితంగా పోలీసులు ఎదురుకాల్పులతో తిప్పికొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలను సేకరించేందుకు యత్నిస్తున్నారు. ఇంకా ఎవరైనా ముష్కరులు ఉన్నారేమో అనే అనుమానంతో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: డ్రైవర్‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని