ETV Bharat / bharat

ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

PRASANTH
ప్రశాంత్​ భూషణ్
author img

By

Published : Aug 31, 2020, 12:22 PM IST

Updated : Aug 31, 2020, 12:48 PM IST

12:36 August 31

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. సెప్టెంబర్‌ 15 కల్లా ఒక రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. డిపాజిట్ చేయకపోతే 3 నెలల జైలు శిక్ష, 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్‌పై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. 

జూన్‌ 27, 29న ప్రశాంత్ భూషణ్‌ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. తనకున్న ప్రాథమిక హక్కులతోనే ఆ ట్వీట్లు చేసినట్లు భూషణ్‌ పేర్కొన్నారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 14న ఆయన్ను దోషిగా తేల్చింది. బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సమయమిచ్చినా ఆయన నిరాకరించడం వల్ల ఈ మేరకు తీర్పు వెల్లడించింది. 

12:20 August 31

ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

  • కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు
     
  • తీర్పు వెలువరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం
     
  • ఒక రూపాయి జరిమాన విధించిన సుప్రీంకోర్టు
     
  • సెప్టెంబర్ 15 కల్లా ఒక రూపాయిని కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశం
     
  • డిపాజిట్ చేయలేకపోతే 3 నెలలు జైలు శిక్ష, 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్ పై నిషేధం

Last Updated : Aug 31, 2020, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.