ETV Bharat / bharat

ప్రభుత్వాధినేతగా 20వ వసంతంలోకి మోదీ - PM Modi enters the 20th consecutive year in public office

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. ప్రభుత్వాధినేతగా ఇరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. తొలిసారి గుజరాత్​ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టి బుధవారం 19 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. పోటీ చేసిన ప్రతిసారి మరింతగా ప్రజావిశ్వాసాన్ని చూరగొనడం మోదీకే సాధ్యమైందని భాజపా వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

PM Modi enters 20th year as democratically elected head of government
ప్రభుత్వాధినేతగా 20వ వసంతంలోకి మోదీ
author img

By

Published : Oct 7, 2020, 12:20 PM IST

ప్రభుత్వాధినేతగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇరవయ్యో ఏడాదిలో అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్​ ముఖ్యమంత్రిగా తొలిసారి ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్​ 7న ఆయన మొదటిసారిగా సీఎంగా ప్రమాణం స్వీకరించారు.

అప్పటినుంచి 2014 మే నెలలో దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చూడలేదు. పోటీ చేసిన ప్రతిసారి మరింతగా ప్రజావిశ్వాసాన్ని పొందడం ఆయనకే సాధ్యమైందని, అది మోదీ దీక్షాదక్షతకు నిదర్శనమని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి.

'చెక్కుచెదరని సంకల్పం..'

'ఆత్మ నిర్భర్​ భారత్​' ఆయన తుది లక్ష్యమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.

"అవిశ్రాంత పనితీరు, గొప్ప దార్శనికత మోదీ విజయాలకు హేతువులు. గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన అత్యున్నత స్థాయిలో నిలుస్తున్నారు. నిరంతరం తనకు తాను సవాల్​ విసురుకుంటూ, బహిరంగంగా లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వాటిని సాధించడం ప్రధానికి అలవాటు. అధికార యంత్రాంగంలో ఉన్న అలసత్వాన్ని ఆయన వదిలించారు. పారిశుద్ధ్యం, గ్రామీ విద్యుదీకరణ, గృహ నిర్మాణం, తాగునీరు వంటి ముఖ్యమైన పథకాలన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూశారు. రాయితీలు అలవాటైన దేశంలో.. ప్రజలే స్వచ్ఛందంగా వాటిని వదిలేసేలా మోదీ చేయగలిగారు. తద్వారా నిరుపేదలకు ఉచిత వంటగ్యాస్​ అందుతోంది" అని నడ్డా పేర్కొన్నారు.

రెండు దశాబ్దాలుగా నిర్హేతుకమైన రీతిలో ఆయనపై ఎన్ని విమర్శలు వస్తున్నా దేశాభివృద్ధి విషయంలో మోదీ సంకల్పం చెక్కుచెదరలేదన్నారు.

ఇదీ చూడండి: 'ఆత్మనిర్భర్ భారత్' పునాదికి రైతులే కీలకం: మోదీ

విద్యుత్తు సంస్కరణల వెలుగులో..

గుజరాత్​ సీఎంగా ఉన్నప్పుడు మోదీ చేపట్టిన సంస్కరణలు ఆయన సాధించిన అతిపెద్ద విజయాల్లో ముఖ్యమైనది. విద్యుత్తు రంగంలో మార్పులకు సాహసించడమంటే రాజకీయ ఆత్మహత్యతో సమానమనే భావన ప్రబలంగా ఉన్న రోజుల్లోనే ఆయన సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు.

రైతులను విశ్వాసంలో తీసుకుని ప్రతి గ్రామానికి విద్యుత్తు సదుపాయాన్ని విస్తరించడమే కాకుండా కొన్నేళ్లలోనే 'మిగులు విద్యుత్తు రాష్ట్రం'గా గుజరాత్​ను మార్చారు. ప్రధానిగా దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్తు అందేలా చేయగలిగారు. 2003 నుంచి ఏటా గుజరాత్​లో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తూ వచ్చిన రీతిలోనే దేశానికి విదేశీ పెట్టుబడులు రాబట్టేలా ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఆడపిల్లల్ని కాపాడుకుని వారికి చదువు చెప్పించడానికి సీఎంగా ప్రకటించిన పథకాన్ని ప్రధాని అయ్యాక 'బేటీ బచావో.. బేటీ పఢావో' పేరుతో దేశమంతటికీ విస్తరించారు.

ఇదీ చూడండి: ప్రభుత్వ పాలనలో మోదీ 'రూటే.. సెపరేటు': నఖ్వీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.