కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సిబ్బంది వ్యవహారాల సహాయక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి తగ్గింపుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉంది. ఈ పరిమితిని 50 ఏళ్లకు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై మంత్రి స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి తగ్గింపు అంశం.. ఏ దశలోను చర్చకు రాలేదని వెల్లడించారు. ఒక వర్గం మీడియా ఇలాంటి తప్పుడు సమచారాన్ని వ్యాప్తి చేస్తుందని మండిపడ్డారు.
ఇదీ చూడండి:ఈటీవీ భారత్ ఎఫెక్ట్: ఎట్టకేలకు ఇల్లు చేరిన కమలేశ్ మృతదేహం