ETV Bharat / bharat

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: ఎట్టకేలకు ఇల్లు చేరిన కమలేశ్ మృతదేహం

ఉత్తరాఖండ్ తేహ్రీకి చెందిన కమలేశ్ భట్ మృతదేహం ఎట్టకేలకు ఇల్లు చేరింది. ఈటీవీ భారత్ చొరవ, దిల్లీ హైకోర్టు ఆదేశాలతో కదిలిన కేంద్రం.. మృతదేహాన్ని ఈ రోజు ఉదయం కమలేశ్ కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు బాధితుడి బంధువులు.

Kamlesh Bhatt
ఇల్లు చేరిన కమలేశ్ మృతదేహం
author img

By

Published : Apr 27, 2020, 12:00 PM IST

ఉపాధి కోసం అబుధాబి వెళ్లి ఈనెల 17న గుండెపోటుతో మరణించిన ఉత్తరాఖండ్ తెహ్రీకి చెందిన కమలేశ్ భట్ మృతదేహం ఎట్టకేలకు పది రోజులకు ఇల్లు చేరింది. ఈ రోజు ఉదయం పార్థివ దేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు. కమలేశ్ మృతదేహం అబుధాబి నుంచి భారత్​కు రావటం ఇది రెండోసారి.

ఈనెల 23న మొదటిసారి అబుధాబి ఎతిహాడ్ విమానాశ్రయం నుంచి దిల్లీ ఇంధిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది భట్ మృతదేహం. అయితే, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్యాకేజీని స్వీకరించేందుకు అనుమతులు లేవని కార్గో సిబ్బంది స్పష్టం చేశారు. విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అప్పగించకుండా గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని వచ్చిన విమానంలోనే తిరిగి అబుధాబి పంపించారు.

మృతదేహాన్ని తిప్పి పంపించటంపై ఈటీవీ భారత్​తో తమ గోడు వెళ్లబోసుకున్నారు అతని కుటుంబ సభ్యులు. ఈ హృదయ విదారక ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించింది ఈటీవీ భారత్​.

కమలేశ్ భట్ మృతదేహాన్ని తిరిగి పంపటంపై న్యాయవాదులు రితుపర్ణ యునియాల్, అభిశేఖ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. అమానవీయంగా, నిర్లక్ష్యంతో సంబంధిత అధికారులు.. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా మృతదేహాన్ని వచ్చిన విమానంలోనే తిరిగి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు.

ఈ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫెట్ తీసుకోవాలని స్పష్టం చేసింది.

Kamlesh Bhatt
కమలేశ్ మృతదేహం

సామాన్యుల గొంతు వినిపించాలి..

మృతదేహం అప్పగించే విషయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను సిగ్గుచేటుగా పేర్కొన్నారు కమలేశ్ భట్ సోదరుడు విమలేశ్ భట్. ఈటీవీ భారత్​కు కృజ్ఞతలు తెలుపుతూ.. ఇదే విధంగా సామాన్యుల గొంతును వినిపించాలని కోరారు.

మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఈటీవీ భారత్, ఇతర మీడియా సంస్థల కారణంగానే మా సోదరుడి మృతదేహాన్ని పొందగలిగాం. ఇదే విధంగా ఈటీవీ భారత్ క్షేత్రస్థాయిలో పని చేస్తుందనే నమ్మకం ఉంది. దాని వల్ల సామాన్యుల సమస్యలు ప్రభుత్వానికి చేరతాయి. ఈ విషయంలో కలుగుజేసుకున్న దిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు.

-విమలేశ్ భట్, కమలేశ్ సోదరుడు

ఇదీ చూడండి: కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.