ETV Bharat / bharat

కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం - కమలేశ్​​ భట్​ వార్తలు

ఎన్నో కలలు, మరెన్నో ఆశలు వెరసి విదేశాల్లో అడుగుపెట్టిన కొడుకు.. అనూహ్యంగా శవమయ్యాడు. గుండెల్లో పెట్టి పెంచుకున్న తల్లిదండ్రులు ఆ విషయం తెలిసి షాక్​లో ఉండగా... అధికారుల బాధ్యతారాహిత్యం ఆ కన్నవారి పాలిట శాపంగా మారింది. గంటల వ్యవధిలో స్వదేశానికి వచ్చిన మృతదేహాన్ని నిబంధనల పేరిట తిప్పి పంపేసి తమ కఠిన మనసును చాటుకున్నారు. ఆ తల్లిదండ్రుల మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈటీవీ-భారత్ తన వంతు ప్రయత్నం ప్రారంభించింది.

Young son's body flown in-out of India within hours; leaving distraught parents clueless
కడసారి చూపునకు నోచుకోకుండానే... క్షణాల్లో శవం మాయం
author img

By

Published : Apr 25, 2020, 1:42 PM IST

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు.. విదేశంలో ఉద్యోగం చేస్తున్నాడని ఆనందపడిన తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఎన్నో ఆశలతో ఉపాధి కోసం వెళ్లిన 23 ఏళ్ల బిడ్డను గుండెపోటు కబళించింది. స్వదేశానికి మృతదేహం వచ్చిందని తెలిసిన కుటుంబసభ్యులు లాక్​డౌన్​ సమయంలోనూ ఇబ్బందులుపడి విమానాశ్రయానికి వెళ్తే.. ఆ ప్రయత్నాన్ని అధికారులు నీరుగార్చారు. కడసారి కొడుకును చూడాలనుకుంటోన్న తల్లిదండ్రులకు మరింత వేదన మిగిల్చారు. మృతదేహాన్ని అందుకోలేక, అతడికి అంత్యక్రియలు చేయలేక వారు ఈటీవీ భారత్​ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏమైంది...?

ఉత్తరాఖండ్​లోని తెహ్రీ గర్వాల్​కు చెందిన కమలేశ్​​ భట్​.. అబుదబికి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడే ఓ సంస్థలో పనిచేస్తున్న అతడు.. ఏప్రిల్​ 17న గుండెపోటుతో మరణించాడు. విషయం తెలిసిన తర్వాత ఓ వ్యక్తి సాయంతో స్వదేశానికి రప్పించిన ఆ మృతదేహన్ని.. లాక్​డౌన్ నిబంధనలు అనుమతించవని గంటల వ్యవధిలో అబుదబికే తిప్పి పంపేశారు భారత అధికారులు. వారి తీరుపై మృతుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Young son's body flown in-out of India within hours; leaving distraught parents clueless
కమలేశ్​ భట్​ పాస్​పోర్టు

" ఏప్రిల్​ 23న ఎతిహాద్​ విమానంలో కమలేశ్​ మృతదేహం స్వదేశానికి వచ్చింది. భారత ఇమ్మిగ్రేషన్​ అధికారులు దాన్ని తీసుకోడానికి నిరాకరించారు. మేము ఆ మృతదేహన్ని తీసుకొనేందుకు ఇబ్బందులు పడుతూ విమానాశ్రయానికి వెళ్లగా.. కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన లాక్​డౌన్​ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్యాకేజీ స్వీకరించేందుకు తమకు అనుమతి లేదని కార్గో సిబ్బంది తెలిపారు. ఎంత అడిగినా శవాన్ని దించకుండానే తిరిగి పంపేశారు. ఇది రెండు దేశాల అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని తెలియజేస్తోంది. భారత విదేశాంగ శాఖ చొరవ తీసుకుంటే ఆ మృతదేహం మాకు చేరేది."

-- విమలేశ్​ భట్​, కమలేశ్​ బంధువు

గంటల వ్యవధిలోనే భారత్​కు వచ్చిన శవపేటికను.. అందుకొనే లోపే తిప్పి పంపడంపై కన్నీరు మున్నీరయ్యారు కుటుంబసభ్యులు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న బాధితుడి తల్లిదండ్రులు కన్నబిడ్డ ఆఖరిచూపు కోసం ఎదురుచూస్తుంటే వారికి ఏమని చెప్పాలి? అంటూ ఈటీవీ భారత్​ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

విమానంతో పంపేటప్పుడు ఇచ్చిన రసీదు

స్వదేశానికి తెచ్చేందుకు చాలా కష్టపడ్డాం..

కమలేశ్​ చనిపోయిన విషయం తెలియగానే అక్కడ ఉన్న మన విదేశాంగ శాఖ.. బాధితుడి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందిచలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.

" కమలేశ్​ చనిపోయిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ తల్లిదండ్రులకు తెలియపరచలేదు. ఓ సామాజిక కార్యకర్త ద్వారా విషయం తెలిసింది. అతడి సాయంతోనే శవ పరీక్షలు చేయించి నాన్​ అబ్జక్షన్​ సర్టిఫికేట్​ తీసుకున్నాం. మృతదేహన్ని స్వదేశానికి తెచ్చేందుకు సొంత డబ్బులతో ఏర్పాట్లు చేసుకున్నాం. తీరా ఇక్కడకు వచ్చేసరికి అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారు."

-- విమలేశ్​ భట్​, కమలేశ్​ బంధువు

ఈటీవీభారత్​ తోడ్పాటు..

ఈ విషయంపై హోంశాఖ, విదేశీ వ్యవహారాల అధికారులను ఈటీవీ భారత్​ సంప్రదించింది. కమలేశ్​ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందించడంలో వైఫల్యానికి సమధానమివ్వాలని కోరింది. అబుదబిలోని భారత ఎంబసీ సరైన సహకారం అందించకపోవడాన్ని ప్రశ్నించింది. హోంశాఖ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.