మరణ శిక్ష అమలుపై స్టే విధించాలన్న నలుగురు దోషుల అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలని తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీచేసింది దిల్లీ కోర్టు. శుక్రవారం ఉదయం 10 గంటలలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
మరణ శిక్ష తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని, వాటిపై స్పష్టత వచ్చేవరకు ఉరిని నిరవధికంగా వాయిదా వేయాలని దోషుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాజ్యం... న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా, శిక్షను ఆలస్యం చేసే ఎత్తుగడలా ఉందని వాదించారు.
వాదనలు ఆలకించిన జడ్జి... తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీచేశారు. విచారణ శుక్రవారం కొనసాగుతుందని స్పష్టంచేశారు.