ముంబయిలో చేతన్ రౌత్ అనే కళాకారుడు రూపొందించిన దుర్గాదేవి చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరు అడుగుల ఎత్తులో తయారు చేసిన ఈ దుర్గాదేవి చిత్రాన్ని తన సృజనాత్మకతను జోడించి రంగురంగుల పిన్నులతో ఎంతో అందంగా తయారు చేశాడు చేతన్రౌత్.
ఆరుగురు కలిసి దాదాపు 36 గంటల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు.


