ETV Bharat / bharat

ఎక్కడ కొడితే నియంత్రించొచ్చో దానిపైనే నిర్ణయం: మోదీ - చౌకీదార్

ఏవిధమైన నిర్ణయం ద్వారా ఉగ్రవాదాన్ని అణచివేయవచ్చో దానినే చేపట్టామన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. బాలాకోట్ వైమానిక దాడులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో 'మై బీ చౌకీదార్' పేరుతో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

ఎక్కడ కొడితే నియంత్రించొచ్చో దానిపైనే నిర్ణయం: మోదీ
author img

By

Published : Mar 31, 2019, 9:01 PM IST

Updated : Mar 31, 2019, 11:56 PM IST

ఎక్కడ కొడితే ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చో అక్కడే కొట్టేందుకే వైమానిక దాడిపై నిర్ణయం తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దిల్లీలో 'మై బీ చౌకీదార్' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. వైమానిక దాడిని అంగీకరిస్తే ఉగ్రక్యాంపు ఉందన్న విషయాన్నీ ఒప్పుకోవాల్సి వస్తోందనే.. దాడులపై పాక్ మౌనం దాల్చిందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ ముందుగా అక్కడ ఉగ్రక్యాంపు లేదని చెప్పిందన్నారు మోదీ. దాడిని అంగీకరిస్తే ఉగ్రక్యాంప్​ ఉన్న విషయం బయటపడుతోందన్న కారణంగానే దాడి జరగలేదని నిరూపించేందుకు ప్రయాసపడుతోందన్నారు.

వైమానిక దాడుల విషయంలో తనపై విమర్శలు చేసేవారు పాక్​కు మేలు చేకూరుస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా దేశవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో చేశారు. భాజపా కార్యకర్తలు, అధికారులు, కాపలాదారులు, వ్యాపారులు, రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

'ఎక్కడ కొడితే నియంత్రించొచ్చో దానిపైనే నిర్ణయం'

"ప్రజాధనంపై ఎవరి పంజా పడనివ్వను. కాపలాదారులా కాపలా కాస్తా...చౌకీదారు అంటే ఒక స్ఫూర్తి. మహాత్మ గాంధీ.. నమ్మకంపై ఎక్కువగా ఉద్బోధించేవారు. మన బాధ్యతల్ని ఒక కాపలాదారుగా చేపట్టాలని చెప్పేవారు. దేశంలోని ప్రతి వ్యక్తి కాపలాదారే. చౌకీదార్​ అనే భావన ప్రతీ ఒక్కరిలో ఉంటే ఎవరికైనా అవినీతి చేసే ధైర్యం ఉంటుందా? ఈ కాపలాదారు తన పని ప్రారంభించాడు. 130 కోట్ల ప్రజలు తమ ప్రేమను, మద్దతును, విశ్వాసాన్ని నాకిచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో అందరూ పోటీలో ఉన్నారు. ప్రజలు అందరినీ గమనిస్తున్నారు. నాకు విశ్వాసం ఉంది. దేశ ప్రజలు చౌకీదార్​ను ఇష్టపడుతున్నారు. రాజులు, మహారాజులు ప్రజలకు అవసరం లేదు. ఈ కారణంగానే చౌకీదార్ అనే నినాదం జనాల్లోకి వెళ్తుంది. రాజకీయ భవిష్యత్ కోసమే ఆలోచిస్తే అది మోదీ కాదు ...2014లో చెప్పాను...ఇప్పుడూ చెబుతున్నాను...దేశంలోని ధనాన్ని కొల్లగొట్టిన ప్రతి ఒక్కరు పైసా పైసా వెనక్కి ఇవ్వాల్సిందే."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Intro:Body:Conclusion:
Last Updated : Mar 31, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.