రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో చట్టాల ఉల్లంఘనలంటూ వస్తున్న ఆరోపణలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ. మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం, విదేశీ విరాళాల ఆరోపణలపై రాజీవ్ ఫౌండేష్ సహా రాజీవ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా మెమోరియల్ ట్రస్టులపైనా విచారణ చేపట్టేందుకు కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వంలో ఈ విచారణ సాగనుంది. ఇందులో పలు శాఖల అధికారులు భాగం కానున్నారు. ఆయా సంస్థల్లో మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం, ఐటీ, ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాల ఉల్లంఘనపై విచారణ చేపట్టనుంది ఈ కమిటీ.
ఇదీ చూడండి: అరుణాచల్ కేంద్రంగా డ్రాగన్ వ్యూహాలు!