ETV Bharat / bharat

వీడియో వైరల్​: కరోనా మృతదేహాల సామూహిక ఖననం

కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న వీడియో ఒకటి వైరల్​గా మారింది. అయితే ఇది కర్ణాటక బళ్లారి జిల్లాలో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Mass burial of dead bodies of Covid patients... Video goes viral
వీడియో వైరల్​: కరోనా మృతదేహలకు సామూహిక ఖననం
author img

By

Published : Jun 30, 2020, 1:28 PM IST

ఇటీవల కరోనా మృతదేహాల అంత్యక్రియల నిర్వహణపై పలు వార్తలు ఆందోళన కలిగించాయి. కొన్ని చోట్ల ఎలాంటి నిబంధనలు పాటించకుండా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తోన్న ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటక బళ్లారి జిల్లాలో ఇది జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్​.. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదని... విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ వీడియోలో వ్యక్తిగత రక్షణ కవచాలను వేసుకున్న కొంత మంది వ్యక్తులు.. మృతదేహాలతో కూడిన సంచులను ఒక గుంతలో వేస్తున్నారు. ఈ దృశ్యాలను ఎవరో చరవాణీలో బంధించారు.

కరోనా మృతదేహలకు సామూహిక ఖననం
మృతదేహాలను గుంతలో వేస్తున్న వ్యక్తులు
సామూహిక ఖననం చేస్తున్న వ్యక్తులు

బళ్లారి జిల్లాలో మొత్తం 773 మంది వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 23 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'ఆ వార్తలు అసత్యం- అమిత్ షా ట్వీట్ ఫేక్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.