ETV Bharat / bharat

పన్ను చెల్లింపుదారుల్లో 117 ఏళ్ల బామ్మ రికార్డ్ - Madhya Pradesh

దేశంలో అత్యంత పెద్ద వయస్సున్న పన్ను చెల్లింపుదారుగా మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బీనా పట్టణానికి చెందిన 117 ఏళ్ల వృద్ధురాలు గిరిజా భాయి తివారీ రికార్డు సృష్టించారు. ఇటీవల 160వ ఐటీ దినోత్సవం సందర్భంగా దేశంలోని నలుగురు వందేళ్లు పైబడిన పన్ను చెల్లింపుదారులను సన్మానించింది ఐటీ శాఖ.

oldest tax payer
అత్యంత పెద్ద వయస్సున్న పన్ను చెల్లింపుదారుగా 117 ఏళ్ల బామ్మ
author img

By

Published : Jul 30, 2020, 3:52 PM IST

అత్యంత పెద్ద వయస్సున్న పన్ను చెల్లింపుదారుగా మధ్యప్రదేశ్​ సాగర్ జిల్లా బీనాకు చెందిన 117 ఏళ్ల వృద్ధురాలు గిరిజా భాయి తివారీ రికార్డు సృష్టించారు. 160వ ఆదాయ పన్ను దినోత్సవం(జులై 24) సందర్భంగా ఆమెను సన్మానించింది ఐటీ శాఖ.

దేశంలో గిరిజా భాయితో పాటు మరో ముగ్గురు వందేళ్లు పైబడిన పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర వాసులైన వీరిని కూడా ఈ సందర్భంగా సత్కరించింది ఐటీ శాఖ. అయితే వీరంతా మహిళలే.

1903లో జననం..

స్వాతంత్ర్య సమరయోధుడైన సిద్ధార్థ్ తివారీ సతీమణి అయిన గిరిజ భాయి పాన్​ కార్డుపై పుట్టిన తేదీ 1903 ఏప్రిల్ 15గా ఉంది. ఆయన మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్వాతంత్ర్య సమరయోధుల పింఛను అందుకుంటున్నారు గిరిజ.

"మా బామ్మ అనేక దశాబ్దాలుగా క్రమంగా పన్ను కడుతూనే ఉంది. నిజాయితీగా పన్ను చెల్లించడంలో ఆమె మాకు స్ఫూర్తి. పన్ను ఎగవేసేవారు మా బామ్మ నుంచి స్ఫూర్తి పొందాలి."

-అంజలి తివారీ, గిరిజా భాయి మునిమనవరాలు

గిన్నిస్ కోసం ప్రయత్నం..

గిరిజా భాయిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఐటీ శాఖ అధికారులు.

ఇదీ చూడండి: గుటెర్రస్​ సలహా బృందంలో ఒడిశా యువతి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.