ETV Bharat / bharat

'రక్తపాతం ఆపేందుకు భారత్​-పాక్​ చర్చలు చేపట్టాలి'

జమ్ముకశ్మీర్​ వివాదాన్ని పరిష్కరించేందుకు, ఎల్​ఓసీ వెంబడి అర్థరహితమైన రక్తపాతాన్ని ఆపేందుకు భారత్​, పాకిస్థాన్​ ప్రభుత్వాలు పోరాటాన్ని వదిలి చర్చలు చేపట్టాలని సూచించింది హురియత్​ కాన్ఫరెన్స్​. ఇరువైపులా అమాయకపు కశ్మీరీలు, సైనికులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొంది.

Indo-Pak talks must to end 'bloodshed': Hurriyat
'రక్తపాతం ఆపేందుకు భారత్​-పాక్​ చర్చలు చేపట్టాలి'
author img

By

Published : Nov 14, 2020, 9:39 PM IST

Updated : Nov 14, 2020, 9:58 PM IST

కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు భారత్​, పాకిస్థాన్​లు చర్చలు చేపట్టాలని సూచించింది​ వేర్పాటువాద సంస్థ హురియత్​ కాన్ఫరెన్స్​. నియంత్రణ రేఖ వెంబడి ప్రజలను బలిగొంటున్న అర్థరహితమైన రక్తపాతాన్ని ఆపాలని కోరింది.

నియంత్రణ రేఖ వెంబడి భారత్​-పాక్​ మధ్య శుక్రవారం కాల్పులు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవటంపై విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేసింది మీర్వైజ్​ ఉమర్​ ఫారూక్​ నేతృత్వంలోని సంస్థ.

"భారత్​, పాకిస్థాన్​ ప్రభుత్వాలు పోరాటాన్ని వదిలి జమ్ముకశ్మీర్​ వివాదాన్ని పరిష్కరించడానికి, రక్తపాతాన్ని అంతం చేసేందుకు చర్చలు చేపట్టాలని హురియత్​ మరోసారి కోరుతోంది. ఎల్​ఓసీ వెంబడి దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో అమాయకపు కశ్మీరీ పౌరులు సహా ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం, సిగ్గుచేటు."

- హురియత్​ కాన్ఫరెన్స్​.

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి పలు సెక్టార్లలో కాల్పులకు పాల్పడింది పాకిస్థాన్​. వారికి భారత భద్రత దళాలు దీటైన సమాధానమిచ్చాయి. వారి స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించాయి. అయితే ఈ ఘటనల్లో భారత్​ వైపు ఐదుగురు జవాన్లు, ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్​ వైపు 8 మంది సైనికులు మరణించగా 12 మంది గాయపడినట్లు సమాచారం.

ఇదీ చూడండి: గిలానీ రాజీనామాతో 'వేర్పాటు' రాజకీయాల్లో కుదుపు

Last Updated : Nov 14, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.