ETV Bharat / bharat

సరిహద్దుల్లో చైనా బుసలు.. భారత్‌కు పరోక్ష హెచ్చరికలు - India-China

సరిహద్దు వెంట ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరిస్తోంది చైనా. లెఫ్టినెంట్ గవర్నర్ స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు పూర్తయిన రెండు రోజులకే సరిహద్దులో భారీ విన్యాసాలకు దిగినట్లు వెల్లడించింది. భారత్​కు గట్టి సందేశం ఇవ్వడమే ఈ చర్య లక్ష్యమని చైనా మీడియా పరోక్షంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్.. దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగుతున్నట్లు చెప్పారు. పరిస్థితి ఇంకా అదుపులోనే ఉన్నట్లు వెల్లడించారు.

china
సరిహద్దుల్లో డ్రాగన్‌ బుసలు.. భారత్‌కు పరోక్ష హెచ్చరికలు
author img

By

Published : Jun 9, 2020, 7:01 AM IST

చైనా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌తో ఉన్న సరిహద్దుల్లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ద్వైపాక్షిక చర్చల్లో నిర్ణయం జరిగి రెండు రోజులు గడిచాయో లేదో.. డ్రాగన్‌ బుసలు మొదలయ్యాయి. సరిహద్దుల్లో భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలకు దిగినట్లు ప్రకటించింది. ఇందులో వేల మంది పారాట్రూపర్లు, యుద్ధ ట్యాంకులు పాల్గొనడం గమనార్హం. భారత్‌కు గట్టి సందేశం ఇవ్వడమే వీటి ఉద్దేశమని ఆ దేశ అధికారిక మీడియా పరోక్షంగా స్పష్టం చేసింది.

సైనిక మోహరింపులు..

తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల సైన్యాల మధ్య దాదాపు నెల రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాలూ పోటాపోటీగా సైనిక మోహరింపులు చేపట్టాయి. వివాద పరిష్కారానికి దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. శనివారం రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదా అధికారుల స్థాయిలో సమాలోచనలు జరిగాయి. సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయనుకున్న తరుణంలో యుద్ధ విన్యాసాల విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌, చైనా సెంట్రల్‌ టీవీ (సీసీటీవీ)లు ప్రకటించాయి. ఈ అభ్యాసాల కోసం.. మధ్య ప్రావిన్స్‌ నుంచి భారీగా బలగాలను సరిహద్దుల్లోకి పంపినట్లు పేర్కొన్నాయి. భారత్‌తో సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలోనే వీటిని చేపట్టినట్లు తెలిపాయి. పౌర విమానాలు, రైళ్లను ఉపయోగించి వేల మంది పారాట్రూపర్‌ సైనికులు, వందలాది ట్యాంకుల, ఇతర సాధన సంపత్తిని విడతలవారీగా తరలించినట్లు పేర్కొన్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లు వివరించాయి.

గతవారం ఇదే తరహాలో..

గత వారం కూడా చైనా సైన్యం ఇదే తరహా విన్యాసం చేపట్టినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల ప్రకటించింది. చైనా సైన్యంలోని టిబెట్‌ మిలటరీ కమాండ్‌.. రాత్రి వేళ శత్రు భూభాగంలోని పర్వత ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లే విన్యాసాలను చేపట్టినట్లు తెలిపింది. 4700 మీటర్ల ఎత్తులో ఈ అభ్యాసాలు జరిగాయని వివరించింది. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ సామర్థ్యాన్ని తమ సైన్యం పరీక్షించిందని తెలిపింది.

రాజ్‌నాథ్‌ సమీక్ష

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా పరిస్థితులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ఒక ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ భేటీలో త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.

'ఇరు దేశాల అగ్రనాయకుల నిర్ణయాన్ని అమలు చేద్దాం'

మరోవైపు.. శనివారం లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదా అధికారుల స్థాయిలో జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యుంగ్‌ సోమవారం ఒక ప్రకటన చేశారు. సరిహద్దు ప్రతిష్టంభనను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతిని కాపాడేందుకు కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు చెప్పారు. విభేదాలు.. వివాదాలుగా మారకుండా చూడాలని రెండు దేశాల అగ్ర నాయకత్వం మధ్య కుదిరిన అంగీకారం మేరకు నడుచుకోవాలని తీర్మానించినట్లు వివరించారు. దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

ఇదీ చూడండి: గ్రామీణ ప్రాంత వైరస్ బాధితుల కోసం వాయుసేన 'అర్పిత్'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.