ETV Bharat / bharat

అన్​లాక్​ 3.0: కొత్త రూల్స్​తో జిమ్​లు ప్రారంభం - gym centres opened in india

లాక్​డౌన్​ కారణంగా మూతబడిన జిమ్​, యోగా కేంద్రాలు బుధవారం తెరుచుకున్నాయి. అన్​లాక్​ 3.0 మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఈ కేంద్రాలను ప్రారంభించారు నిర్వాహకులు.

Unlock3
అన్​లాక్​
author img

By

Published : Aug 5, 2020, 12:32 PM IST

అన్​లాక్​ 3.0 ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా జిమ్​లు, యోగా​ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం మార్గదర్శకాలను అనుగుణంగా భౌతిక దూరం, భద్రతా చర్యలు పాటిస్తూ జిమ్​లకు వెళుతున్నారు ప్రజలు. సుదీర్ఘ సమయం​ తర్వాత జిమ్​లు ప్రారంభం కావటంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Unlock3
ప్రారంభమైన జిమ్ కేంద్రాలు

కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం జిమ్​లు, యోగా కేంద్రాలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. 65 ఏళ్ల వయస్సు వారు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణీలు, పదేళ్ల వయస్సు లోపు పిల్లలను జిమ్‌, యోగా కేంద్రాల్లోకి అనుమతించకూడదు. స్పా, స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్ వంటివి మూసి ఉంచాలని తెలిపింది.

Unlock3
సాధన చేస్తూ..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాలి. ఫేస్‌ గార్డ్స్‌/మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. యోగా/వ్యాయామం వంటివి చేసేప్పుడు మాత్రం ఫేస్‌ గార్డ్‌ ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యాయామం చేసే సమయంలో ఎన్‌-95 మాస్క్‌లు ధరించకపోవడం మేలు.

Unlock3
జిమ్ పరికరాలను శుభ్రం చేస్తూ..

సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం వంటివి తరచుగా చేస్తుండాలి. అలానే దగ్గు, జలుబు వంటి వచ్చినప్పడు టిష్యూ, చేతి రుమాలుతో, మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి, ఉమ్మటం వంటివి చేయకూడదు. ఆరోగ్య సేతు యాప్‌ ప్రతి ఒక్కరు ఉపయోగించడం ఉత్తమం.

ఇదీ చూడండి: కరోనా వేళ జిమ్​లు ఎంత సురక్షితం?

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.