ETV Bharat / bharat

కరోనాపై 'ఆపరేషన్​ దియా'- ఎందుకు? ఎలా? - india fights corona

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా రక్కసిపై పోరులో యావత్​ దేశం ఒక్కతాటిపై ఉందని రుజువు చేసేందుకు ప్రజలంతా నేడు ఇళ్లలో లైట్లు ఆపి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఇలా ఎందుకు చేయాలి? ఒకే సారి దేశమంతా లైట్లు ఆర్పితే పవర్​ గ్రిడ్​ కుప్పకూలి అంధకారంలోకి వెళ్తామా? ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రావచ్చా? చీకట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

fight-against-covid-19
కరోనాపై 'ఆపరేషన్​ దియా'- ఎందుకు? ఎలా?
author img

By

Published : Apr 5, 2020, 5:41 AM IST

దేశంలో ఉన్న 130 కోట్ల జనాభా నేటి సాయంత్రం ఓ బృహత్​ కార్యాన్ని చేపట్టబోతోంది. ప్రశాంతంగా సాగుతున్న ప్రజల జీవనాన్ని స్తంభింపజేసిన ఓ అదృశ్య శక్తిపై పోరాడేందుకు తామంతా ఒక్కటే అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వబోతోంది. కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొడతామనే సంకల్పాన్ని చాటిచెప్పబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించనుంది యావత్​ భారతం.

ఎందుకు లైట్లు ఆర్పాలి?

దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు 21 రోజుల లాక్​డౌన్ విధించిన అనంతరం తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. జనతా కర్ఫ్యూతో భారతీయులు తమ శక్తిసామర్థ్యాలు చాటారని కొనియాడి, ప్రజలంతా ఏకమై భారత్​లో కరోనాను తరిమికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని పునరుద్ఘాటించారు. ఈ ఆదివారం రాత్రి లైట్లన్నీ ఆపేసి కేవలం కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించి, సరిగ్గా 9 గంటలకు మొదలుపెట్టి 9 నిమిషాలపాటు దీన్ని కొనసాగించాలన్నారు మోదీ. ఇలా చేయడం సంకట సమయంలో భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.

130 కోట్లమంది భారతీయుల సంకల్పంతో మనమేంటో రుజువు చేసేందుకు లైట్లు ఆర్పి ప్రధాని పిలుపును విజయవంతం చేయాలి.

బయటకు రావొచ్చా?

ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అలా చేస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే గడప దాటకుండా ఇంట్లోనే లైట్లన్నీ ఆర్పి, కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలి. కుదరకపోతే మొబైల్​ ఫ్లాష్, టార్చ్​లైట్లను ఉపయోగించాలి. ఈ సమయంలో సామాజిక దూరం కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. ఇంటి గడపనే లక్ష్మణ రేఖగా భావించాలి. అడుగు బయటపెట్టకూడదు.

విద్యుత్​ పరికరాలు అన్నీ ఆపేయాలా?

లేదు. మన ఇంట్లోని లైట్లు మాత్రమే ఆర్పివేయాలి. వీధి లైట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లను యథావిధిగా పనిచేయనివ్వాలి.

పవర్​గ్రిడ్ కుప్పకూలుతుందా?

దేశంలోని ప్రజలంతా ఒకేసారి లైట్లు ఆర్పివేస్తే పవర్​గ్రిడ్ కుప్పకూలి అంధకారంలోకి వెళ్తామనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అలా ఏం జరగదని కేంద్రం భరోసా ఇస్తోంది. ఎలాంటి నష్టం జరగకుండా పవర్​ ఫ్లక్చువేషన్స్​ తట్టుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతోంది. విద్యుత్​ డిమాండ్ అకస్మాత్తుగా పడిపోతే దానిని పరిష్కరించే వెసులుబాట్లు ఉన్నాయని స్పష్టం చేస్తోంది. ఇందుకు పవర్​ సిస్టెమ్​ ఆపరేషన్​ కార్పొరేషన్ బాధ్యత వహిసస్తుందని వివరణ ఇస్తోంది. 12 నుంచి 13 గిగావాట్లకు మించి విద్యుత్​ డిమాండ్ తగ్గదని... ఇది 9 నిమిషాల్లో రికవర్ అవుతుందని చెబుతోంది.

బ్లాక్ఔట్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదని, ఎర్త్​ అవర్​ సమయాల్లోనూ ఇలా చేస్తామని గుర్తుచేసింది కేంద్రం. 2012లో ఓ సారి పవర్​ గ్రిడ్ ఫెయిల్ అవ్వడానికి సాంకేతిక లోపమే కారణమని తెలిపింది.

ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?

ఐకమత్య వెలుగు కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు చేతులకు శానిటైజర్​ను అసలు రాసుకోకూడదు. అందులో ఉండే ఆల్కహాల్​ కారణంగా అగ్నిప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. శరీరం కాలి ప్రాణానికే ముప్పు వాటిల్లే ముప్పు ఉంది. అందుకే శానిటైజర్లకు ఆ సమయంలో ఆమడ దూరంలో ఉండాలి.

అందరూ పాల్గొనాలా?

ప్రపంచవ్యాప్తంగా కోరలు చాచి మానవాళి మనుగుడకే ప్రమాదకరంగా మారిన కరోనా రక్కసిపై దేశ ప్రజలతో కలిసి పోరాడుతున్నామని చాటి చెప్పేందుకు ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. అయితే... వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బంది యథావిధిగా తమ విధుల్లో నిమగ్నమై ఉండాలని సూచించింది కేంద్రం.

ఇదీ చూడండి: '30 శాతం కేసులకు తబ్లీగీనే కారణం.. 17 రాష్ట్రాల్లో ప్రభావం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.