ETV Bharat / bharat

'30 శాతం కేసులకు తబ్లీగీనే కారణం.. 17 రాష్ట్రాల్లో ప్రభావం'

author img

By

Published : Apr 4, 2020, 5:14 PM IST

దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాతే వల్ల దేశంలో కరోనా కేసులు పెరిగాయని ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతం తబ్లీగీతో సంబంధమున్నవేనని తెలిపింది . మర్కజ్​తో సంబంధాలున్నవారిలో 1023మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని స్పష్టం చేసింది.

corona
30 శాతం కేసులకు తబ్లీగినే కారణం.. 17 రాష్ట్రాల్లో ప్రభావం

దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాతే వల్ల దేశంలో కరోనా వేగంగా విస్తరించిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. మర్కజ్​ సమావేశాల వల్ల 17 రాష్ట్రాలపై వైరస్ ప్రభావం పడిందని పేర్కొంది . దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతం తబ్లీగీతో సంబంధమున్నవేనని విశదీకరించింది. తబ్లీగీ కారణంగా వైరస్ బాధితులుగా తేలినవారి సంఖ్య ఇప్పటివరకు 1023 గా ఉందని స్పష్టం చేసింది.

ఆ రాష్ట్రాల్లో జల్లెడ..

దిల్లీ మర్కజ్​లో పాల్గొన్నవారి కోసం 17 రాష్ట్రాల్లో అధికారులు గాలిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ. కాంటాక్టు ట్రేసింగ్​ల కోసం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మర్కజ్​కు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన 22,000 మందిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచినట్లు వెల్లడించింది.

ఇదీ జరిగింది..

దిల్లీ హజ్రత్​ నిజాముద్దీన్ ప్రాంతం మర్కజ్​ భవనంలో జనతా కర్ఫ్యూనకు ముందు 'తబ్లీగ్-ఎ-జమాత్'​ పేరుతో కొద్ది రోజుల పాటు మత ప్రార్థనలు జరిగాయి. 23వ తేదీన 1500మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. మరో 1000మంది మర్కజ్​లో ఉండిపోయారు. అయితే ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో పదులసంఖ్యలో వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పలువురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు మర్కజ్​లో పాల్గొన్నవారిని నిర్బంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది: 'వైరస్ పరీక్షలు పెరిగితేనే లాక్​డౌన్​తో ప్రయోజనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.