కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలు, ముందు వరుసలో పోరాడుతున్న యోధులతో పాటు ప్రాధాన్య వర్గాలకు ఇచ్చేందుకు సరిపడా నిల్వలున్నాయని నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మరికొన్ని టీకాలు కూడా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. టీకా నిల్వలు కూడా భారీగా పెరుగుతాయని చెప్పారు.
కరోనా టీకా పంపిణీ ప్రక్రియ కూడా వేగంగా సాగుతుందని పాల్ వెల్లడించారు. కరోనా టీకా కొనుగోలు విషయంలో అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలను చైతన్యపరచడమే అతి పెద్ద ప్రక్రియని పాల్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ద్వారా లేదా సహజంగా ప్రజల్లో 70 శాతం రోగనిరోధకత సాధించగలిగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని.. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను భారీగా చేపడుతున్నట్లు పాల్ వివరించారు.
ఇదీ చదవండి: టీకాల తయారీలో కొత్త చరిత్రకు నాంది