ETV Bharat / bharat

కరోనా ఆంక్షల నడుమ.. మైసూర్​లో 'దసరా' ఉత్సవాలు - కర్ణాటకలో దసరా వేడుకలు

కర్ణాటకలోని మైసూర్​లో ప్రతి ఏటా అత్యంత వైభవంగా సాగే దసరా ఉత్సవాలు.. ఈ ఏడాది కరోనా ఆంక్షల నడుమ ప్రారంభమయ్యాయి. మైసూర్​ రాజవంశీయుల ఇష్టదైవం చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ఆరంభించారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కరోనా నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

Dasara festivities begin in Mysuru
మైసూర్​లో 'దసరా' ఉత్సవాలు షురూ
author img

By

Published : Oct 17, 2020, 1:23 PM IST

కరోనా నిబంధనల నడుమ మైసూర్​లో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పండుగగా ప్రతిఏటా 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలపై ఈ సారి కొవిడ్​ ప్రభావం పడింది. అయినప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.

చాముండి కొండపై ఉన్న అమ్మవారు, మైసూర్​ రాజవంశీయుల కులదైవం చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప. వేడుకల ప్రారంభ కార్యక్రమంలో బెంగళూరులోని శ్రీజయదేవ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్​ కార్డియోవాస్కులర్​ సెన్సెస్​ అండ్​ రీసెర్చ్​ డైరెక్టర్​, కరోనా పరీక్షల నోడల్ అధికారి డాక్టర్​ సీఎన్​ మంజునాథ్​తోపాటు కరోనా పోరులో ముందుండి విశేష సేవలందించిన మరో ఆరుగురిని సన్మానించారు యడియూరప్ప.

Dasara festivities begin in Mysuru
కరోనా యోధులను సత్కరిస్తున్న యడియూరప్ప

410వ ఉత్సవాలు..

410వ దసరా ఉత్సవాలను నిరాడంబరంగా, సంప్రదాయాలను పాటించేలా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 10 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో రాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా జానపద కళలను ప్రదర్శిస్తారు. అయితే ప్రతి ఏటా వేడుకలు, ప్రదర్శనలను చూసేందుకు ప్రజలు, పర్యటకులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ సారి కరోనా కారణంగా పలు కార్యక్రమాలపై మైసూర్​ అధికారులు ఆంక్షలు విధించి.. లైవ్​ ప్రసారం అందిస్తున్నారు.

Dasara festivities begin in Mysuru
కరోనా యోధులను సత్కరిస్తున్న యడియూరప్ప

జంబో సవారీ

ఈనెల 26వ తేదీన విజయ దశమి ( వేడుకల 10వరోజు) చాముండేశ్వరి అమ్మవారి జంబో సవారీ (ఏనుగుపై ఊరేగింపు) నిర్వహిస్తారు. ప్రతిఏటా అత్యంత వైభంగా.. లక్షల మంది ప్రజల సమక్షంలో ఈ ఊరేగింపు జరుగుతంది. మైసూర్​ ప్యాలస్​లోనూ దసరా ఉత్సవాలు నిర్వహించాలని రాజకుటుంబం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలో ఎంపిక చేసిన వారి సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.