ముంబయి సెషన్స్ కోర్టు.. గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు రెండేళ్ల జైలు విధించింది. ముంబయికి చెందిన ఓ బిల్డర్‌ను రూ.26 కోట్లు డిమాండ్ చేసిన కేసులో రాజన్‌తో పాటు అతని అనుచరులైన మరో ముగ్గురికీ ఇదే శిక్ష విధించింది కోర్టు.
ఏం జరిగింది?
మహారాష్ట్రకు చెందిన బిల్డర్ నందు వాజేకర్.. ఏజెంట్ పరమానంద్ ఠక్కర్ సహాయంతో 2015లో పుణెలో కొంత స్థలం కొన్నాడు. ఇందుకు టక్కర్‌కు రూ. కోట్లు కమిషన్ ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. కానీ ఠక్కర్ అదనపు డబ్బు డిమాండ్ చేశాడు. దానికి వాజేకర్ ససేమిరా అన్నాడు. దీంతో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను సంప్రదించాడు ఠక్కర్. రాజన్ తన మనుషుల్ని వాజేకర్ ఆఫీస్‌కు పంపించి రూ.26కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపుతానని బెదిరించాడు.
ఇదీ చదవండి: తల లేని మృతదేహం గుర్తింపు- హత్యాచారమేనా?