ETV Bharat / bharat

త్వరలోనే సీఏఏ అమలు చేస్తాం: నడ్డా - భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

దేశంలో త్వరలోనే పౌర సవరణ చట్టాన్ని అమలు చేస్తామని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం భాజపా పనిచేస్తుందన్న ఆయన.. బంగాల్​ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ రాజకీయాలతో ప్రజలకు విసుగొచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే పైచేయి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

CAA to be implemented soon : Nadda
త్వరలోనే సీసీఏ అమలు చేస్తాం: నడ్డా
author img

By

Published : Oct 19, 2020, 7:19 PM IST

Updated : Oct 19, 2020, 8:17 PM IST

దేశవ్యాప్తంగా త్వరలోనే పౌర సవరణ చట్టాన్ని అమలు చేయనున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బంగాల్ పర్యటనలో ఉన్న ఆయన.. కరోనా వ్యాప్తి కారణంగానే సీఏఏ అమలు ఆలస్యమైనట్లు చెప్పారు.

2021లో జరిగే బంగాల్‌ శాసనసభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఒకరోజు పర్యటనకు వచ్చిన నడ్డా.. సిలిగిరిలోని వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం భాజపా పనిచేస్తుంటే.. సీఎం మమతా బెనర్జీ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం విభజించు, పాలించు విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు నడ్డా. పౌర సవరణ చట్టం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుందన్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టాన్ని అమలు చేసేందుకు నరేంద్ర మోదీ సర్కార్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) హింసా రాజకీయాలతో ప్రజలు విసిగి వేసారారని.. 2021 ఎన్నికల్లో భాజపా అధికారం చేపట్టడం ఖాయమని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బిహార్​లో యోగికి క్రేజ్​- కీలక స్థానాల్లో ప్రచారం

Last Updated : Oct 19, 2020, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.