ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పికప్ వ్యాన్ బోల్తా పడటం వల్ల 10 మంది మరణించారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు.
కోరాపుట్ జిల్లాలోని కోత్పడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓ సంతాప కార్యక్రమానికి వెళ్లి తిరిగివస్తుండగా వ్యాన్ బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ప్రధాని మోదీ విచారం..
ఒడిశా రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.