గుజరాత్ అహ్మదాబాద్‌లో 31వ అంతర్జాతీయ గాలిపటాల పండుగ-2020 ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగు రంగుల అలంకరణలతో విదేశీ అతిథులు మైమరచిపోయేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
వల్లభాస్థాన్, రివర్ ఫ్రంట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రారంభించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, పర్యటక శాఖ మంత్రి జవహార్ చావ్డా సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పతంగుల పోటీల్లో మొత్తం 43 దేశాలు పాల్గొంటున్నాయి. మన దేశం నుంచి 12 రాష్ట్రాలకు చెందిన 153 రకాల గాలిపటాలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి.
వివిధ దేశాల నుంచి ఈ పండులో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను అలరించేందుకు భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ నృత్యాలు, ఉత్తరాయణం పండుగ విశేషాలు తెలుపుతూ నాటకాలు, పాటలు, ఒక్కటేమిటి ఎటు చూసినా కోలహలమే. ఈ ప్రాంగణంలో 20కి పైగా ఫుడ్ స్టాల్స్, సుమారు 50 క్రాఫ్ట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: కరడుగట్టిన రేపిస్ట్‌కు జీవితఖైదు- బాధితులంతా అబ్బాయిలే!