ETV Bharat / bharat

బంగాల్​లో కూలిన వంతెన.. ఇద్దరు మృతి

బంగాల్​ మాల్దా జిల్లాలోని వైష్ణవ్​నగర్​లో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

2-killed-7-injured-after-girder-of-under-construction-bridge-collapses-in-west-bengal
బంగాల్​లో కూలిన వంతెన.. ఇద్దరు మృతి
author img

By

Published : Feb 16, 2020, 11:37 PM IST

Updated : Mar 1, 2020, 2:05 PM IST

నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన బంగాల్​ మాల్దా జిల్లా వైష్ణవ్​నగర్​​ ప్రాంతంలో చోటుచేసుకుంది. మరో ఏడుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బంగాల్​లో కూలిన వంతెన

రాత్రి 8 గంటల సమయంలో ఈ ఫరక్కా వంతెన కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

Last Updated : Mar 1, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.