గోసంరక్షణను ప్రబోధిస్తు ఫైజ్ఖాన్ చేపట్టిన పాద యాత్ర రాజస్థాన్‌లోని సింఘానా చేరుకుంది. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
జమ్మూ-కశ్మీర్‌లోని లద్ధాఖ్‌కు చెందిన మహమ్మద్ ఫైజ్ ఖాన్.. . ప్రజాసేవలో భాగంగా గోవధను వ్యతిరేకిస్తూ, గోమాత గొప్పదనాన్ని చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కన్యాకుమారి నుంచి అమృత్సర్ దాకా 14 వేల కి.మీ పాదయాత్ర చేయాలని సంకల్పించాడు. 2017 లో జూన్ 24న యాత్ర ప్రారంభించి 11వేల కి.మీ నడిచి రాజస్థాన్‌లోని సింఘానాకు చేరుకున్నారు.
ఖాన్ సంకల్పానికి ప్రతిగ్రామంలోనూ ఘన స్వాగతం లభిస్తోంది. పూలమాలలు, విజయ సింధూరాలతో మహిళలు స్వాగతిస్తున్నారు. పేరుకు ముసల్మాన్ అయినా.. గ్రామాల్లో ప్రముఖ దేవాలయాలను సందర్శించి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. దేశంలో మతాల కాదు మానవత్వం వర్ధిల్లాలని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గోరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణతో పాటు పలు సామాజిక అంశాలపై పోరాడుతున్నారు ఖాన్. మరో 2500 కిలోమీటర్లతో తన పాదయాత్ర పూర్తవుతుందని చెప్పుకొచ్చారు.
" 14 వేల కి.మీల గోసేవా సద్భావన పాదయాత్రలో ఇప్పటివరకు దాదాపు 11వేల కి.మీ పూర్తయింది. గోసేవా, గోరక్ష, వృక్షాలను కాపాడండి, నదులను కాపాడి పర్యావరణాన్ని రక్షించండి. దేశంలో ప్రేమా, మమకారాలను పెంచండి. ఈ రోజుల్లో కేన్సర్‌కు ప్రధాన కారణం రసాయనిక ఎరువులు. అందుకే ఆవు పేడను పొలాల్లో ఎరువులా వాడాలి. వేదాలలో ఆవులను విశ్వానికి గోమాతగా పేర్కొన్నారు. హజ్రత్ సల్ ఉల్లాహ్ ప్రవక్త గోపాలు అమృతం అన్నారు. అందుకే ఆవులను కాపాడుతూ భూమిని కాపాడాలి."
-మహమ్మద్ ఫైజ్ఖాన్, పాదయాత్రికుడు
ఇదీ చూడండి: మీసం కత్తిరించారని సెలూన్‌పై కేసు!