ప్రసాదం తిని దాదాపు 170 మంది అస్వస్థతకు గురయ్యారు. బిహార్ ముంగేర్ జిల్లా కొత్వాన్ గ్రామంలో జరిగిందీ ఘటన.
ఎలా జరిగింది?
కొత్వాన్ గ్రామానికి చెందిన మహేశ్ కోదా అనే వ్యక్తి తన ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 250పైగా మంది హాజరయ్యారు. వారంతా అక్కడ అందజేసిన ప్రసాదాన్ని తిన్నారు. అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.
"ప్రసాదం తిన్న తర్వాత నా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో ప్రసాదం తిన్నవారందరి పరిస్థితి ఇలాగే ఉంది. వారిలో చాలా మంది కడుపు నొప్పితో బాధపడ్డారు, వాంతులు చేసుకున్నారు."
-గ్రామస్థుడు
ఈ సమాచారం అందుకున్న వెంటనే వైద్య సిబ్బంది.. కొత్వాన్ గ్రామానికి చేరుకుని చికిత్స అందించారు. చికిత్స అనంతరం వారిలో చాలా మంది పరిస్థితి మెరుగైందని జిల్లా మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ తెలిపారు. 170 మందిలో 80 మంది చికిత్స పొందుతున్నారని వైద్యుడు డాక్టర్ ఎన్కే మహతా తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు.