ETV Bharat / bharat

ఉడుతతో అనుబంధం.. అజీకి అదే ఆనందం! - అజీ ఉడత

మనం రోడ్డు మీద వెళుతుంటే ఎన్నోసార్లు వివిధ పక్షులు, జంతువులు తారసపడుతుంటాయి. అవన్నీ ఏదో ఒక బాధలో ఉన్నా.. సమయం లేక పట్టించుకోం. ఒక్కోసారి సమయమున్నా వాటిని చేరదీసే సాహసం చెయ్యం. కానీ కేరళకు చెందిన 'అజీ' అలా ఆలోచించలేదు. కళ్లు కూడా తెరవని ఉడుతను చేరదీసి.. అన్నీ తానై చూసుకుంటున్నాడు. పాలు తాగిస్తూ.. దాని ఆలనా పాలనాను చూస్తూ మురిసిపోతున్నాడు.

An 'uncaged' bond of love
ఉడతపై ప్రేమ.. యువకుడికి అదే లోకం!
author img

By

Published : Jan 25, 2021, 6:38 AM IST

ఉడుతతో అనుబంధం.. అజీకి అదే ఆనందం!

సహజంగా ఎవరైనా శునకాలను, పక్షులను పెంచుకుంటారు. కానీ కేరళ కాసర్​గోడ్​కు చెందిన అజీ మాత్రం.. ఎంతో ప్రేమతో ఓ ఉడుతను పెంచుకుంటున్నాడు. ఆ ఉడుత కోసం అన్నీ తానే అయ్యాడు. దానికి ముద్దుగా 'కిచ్చు' అని పేరు కూడా పెట్టాడు.

కేరళ ఆరోగ్యశాఖలో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు అజీ. సుమారు నెల క్రితం పెరియాలోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా అతనికి ఓ ఉడుత పిల్ల కనిపించింది. తల్లి ఉడుత వస్తుందనే ఆశతో ఆరోజు రాత్రి వరకు అక్కడే ఉండిపోయాడు. కానీ ఆ తల్లి ఉడుత రాలేదు. ఇక కళ్లు కూడా తెరవని పిల్ల ఉడుతను ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవడం మొదలుపెట్టాడు.

సమయానికి పాలు..

కిచ్చు అని పిలవగానే ఎక్కడున్నా పరుగెత్తుకుంటూ వస్తుంది ఆ చిట్టి ఉడుత. చటుక్కున అతని పైకి ఎక్కి చేతిలో వాలిపోతుంది. దానికి పాలు తాగిస్తాడు. చేతుల్లో కూర్చొపెట్టుకుని 'కిచ్చు'కు అలా పాలు తాగించటం తనకు చాలా ఇష్టమని మురిసిపోతున్నాడు. మూగజీవి పట్ల ప్రేమను చూపించే ఆ యువకున్ని చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు.

జేబులోనే ప్రయాణం..

కిచ్చు ఎప్పుడూ అజీ జేబులోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా అతని చుట్టూనే తిరుగుతూ, ఆడుతూ ఉంటుంది. పాలు తాగేటప్పుడే కాదు.. బయటకు వెళ్లినప్పుడు సైతం అతనితో ఉంటుంది. బైక్​పైనా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో అది ముందే కూర్చుంటుంది. రాత్రిపూట అజీతో పాటే అతని దుప్పట్లో నిద్రిస్తుంది.

ఉడుతతో అనుబంధం..

కిచ్చు తమ కుటుంబంలో ఒకటిగా మారిపోయిందని అజీ తెలిపాడు. 'కిచ్చు'ను దూరం చేసుకునే ఆలోచన లేదని.. ఈ బంధం ఎంతో విలువైనదని చెమర్చిన కళ్లతో చెప్పాడు. వీలైనంత ఎక్కువ కాలం 'కిచ్చు'తో కలిసి ఉండాలని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: కన్నుల పండుగగా 'గోమాత సీమంతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.