ETV Bharat / bharat

బారాబంకీ మసీదు కూల్చివేతపై విచారణ కమిటీ

ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీలో మసీదు కూల్చివేత ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్​.. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు.

Adityanath
సీఎం యోగీ ఆదిత్యానాథ్
author img

By

Published : May 23, 2021, 4:31 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీ జిల్లాలోని మసీదు కూల్చివేత ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్​.. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

ఏం జరిగింది?

బారాబంకి జిల్లాలోని వందేళ్లనాటి ఓ పురాతన మసీదును అధికారులు కూల్చివేశారని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఈనెల 18న ఆరోపించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ చర్య చేపట్టిందని పేర్కొంది. అయితే, మసీదు అక్రమ నిర్మాణమని, కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చేశామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారం వివాదాస్పదమవగా... యోగి విచారణకు ఆదేశించారు.

ఇదీ చదవండి: కరోనా రోగుల కోసం 48 గంటల్లో రూ.కోటి సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.