సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదైంది. సాయంత్రం 8.49 గంటల సమయంలో భూమి కంపించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు స్పష్టం చేసింది.
భయాందోళనతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఘటనపై పీఎం ఆరా!
ఈశాన్య భారతంలోని భూకంప ప్రభావిత రాష్ట్రాల సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. బిహార్, అసోం, సిక్కిం రాష్ట్రాల్లో పరిస్థితిపై ఆరా తీసినట్లు అధికావర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో చేతబడి!