కరోనా రెండో దశ విజృంభణలో దేశవ్యాప్తంగా 400మందికి పైగా వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వెల్లడించింది. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 420 మంది వైద్యులు చనిపోయారని పేర్కొంది. ఒక్క దిల్లీలోనే 100 మంది మరణించినట్లు స్పష్టం చేసింది.
గుజరాత్‌లో 31 మంది వైద్యులు చనిపోగా తెలంగాణ 20, బంగాల్ 15, మహారాష్ట్రలో 15మంది సెకండ్ వేవ్‌లో మరణించినట్లు ఐఎంఏ పేర్కొంది. దేశంలో కరోనా వెలుగు చూసిన నాటి నుంచి ఇప్పటి వరకు 748 వైద్యులు మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలు వదిలినట్లు ఐఎంఏ గణాంకాలు వెల్లడించాయి.
అయితే వాస్తవ గణాంకాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12లక్షల మంది వైద్యులు.. సేవలు అందిస్తున్నట్లు ఐఎంఏ పేర్కొంది. తాజా 3.5లక్షల మంది వైద్యులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: ఆగని మరణాలు- మరో 4,194 మంది వైరస్‌కు బలి