స్టంట్ పేరుతో నదిలోకి జంప్.. తిరిగిరాని యువకుడు.. వీడియో వైరల్!
🎬 Watch Now: Feature Video
వరద నీటిలో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని మాలేగావ్‌లో వెలుగుచూసింది. స్టంట్స్ పేరుతో బ్రిడ్జిపైనుంచి గిర్ణా నదిలోకి దూకాడు నయీమ్ అమీన్ అనే ఓ యువకుడు. ఇదంతా అతడి స్నేహితులు ఫోన్లో రికార్డు చేస్తున్నారు. కానీ.. నదిలో వరద ఉద్ధృతికి నయీమ్ కొట్టుకుపోయాడు. ఎంతసేపు గాలించినా.. అతడి ఆచూకీ లభించలేదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు.. మాలేగావ్‌లోని గిర్ణా, మోసమ్ నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో అక్కడకు జనం పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి చోట్ల పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.