మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కి నిద్రిస్తున్న చిరుత.. భయంభయంగా జనం - మనుషుల్ని చంపుతున్న చిరుత
🎬 Watch Now: Feature Video
Alipurduar Leopard: ఓ చిరుత నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ.. మామిడి చెట్టుపై నిద్రిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి చిరుతను పట్టుకెళ్లారు. ఈ ఘటన బంగాల్ అలీపుర్ద్వార్ జిల్లాలోని షిల్బరీహట్ ఘాట్పడ్ ప్రాంతంలో జరిగింది. కొద్దిరోజులుగా చిరుత ప్రజల్ని వేటాడుతుందని గ్రామస్థులు తెలిపారు. కొందరు అదృశ్యమవగా.. మరికొందరు గాయపడినట్లు పేర్కొన్నారు. మంగళవారం.. రబియుల్ మియాన్ అనే వ్యక్తి ఇంటిపక్కన మామిడి చెట్టుపై చిరుత నిద్రిస్తుండటం చూసి అధికారులకు సమాచారం అందించారు. దాన్ని ప్రశాంతపర్చేందుకు రెండు ట్రాంక్విలైజర్ షాట్స్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. చిరుతను మళ్లీ అడవిలోకి వదిలిపెడతామని చెప్పారు అటవీ సిబ్బంది.