దేశభక్తి గీతాలు పాడిన కోటి 21 లక్షల మంది.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లో విద్యార్థులు ప్రపంచ రికార్డును సాధించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారంలో కోటి 21లక్షల మంది విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు. రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందేమాతరం, సారే జహాన్ సే అచ్చా వంటి గీతాలను దాదాపు 25 నిమిషాల పాటు ఆలపించి రికార్డు సృష్టించారు. జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో కార్యక్రమంలో పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించిన సీఎం అశోక్ గహ్లోత్.. ఈ ఘనత సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతిష్ఠాత్మకమైన లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోటి 21లక్షల మంది విద్యార్థులు పాడిన దేశభక్తి గీతాలను విని అవార్డు అందించడం సంతోషంగా ఉందని గహ్లోత్ అన్నారు.