ప్రతిధ్వని: తెలుగుకు వెలుగేది? నిధుల విడుదలలో వివక్ష ఎందుకు?
🎬 Watch Now: Feature Video
దేశ భాషలందు తెలుగు లెస్స..అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కానీ...ఇది కేవలం నానుడిగానే మిగిలిపోతుందనే ఆందోళన కలుగుతోంది. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించి దాదాపు దశాబ్ధంపైనే అవుతోంది. మన కంటే కాస్తా ముందుగా ప్రాచీన హోదా పొందిన తమిళ భాషాభివృద్ధికి ఇస్తున్నటు వంటి నిధులు కూడా మన తెలుగుకు ఇవ్వటం లేదు. ఇది మన భాషపై ఏ విధంగా వివక్ష ఉందో చెప్పేటటువంటి పరిస్థితి. భారతీయ భాషల విశ్వవిద్యాలయం ఏర్పాటులో కనీసం తెలుగుకు ప్రాతినిద్యం కూడా లేదు. దేశంలో రెండో అతిపెద్ద భాషగా ఉన్న తెలుగుకు ఇది ఆందోళన కలిగించే విషయం. ప్రాచీన హోదా కలిగిన తెలుగుకు పునర్వికాసం కలుగుతుందా...దానికి మనమందరం చేయాల్సిన ప్రయత్నాలేంటి? అనే అంశంపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది.