ETV Bharat / state

మామూలు ప్లాన్​ కాదు - బంగారం దోపిడీకి ఏం చేశాడంటే ! - CINEMA STYLE ROBBERY

వ్యసనాలకు లోనై బంగారం కాజేసేందుకు యత్నం - దోపిడీ దొంగల పేరుతో నాటకం - పోలీసుల విచారణలో బయటపడ్డ వాస్తవాలు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 5:16 PM IST

Updated : Nov 20, 2024, 6:50 PM IST

A Person Cheated Goldshop Owner in Tadepalligudem: అతను బంగారం షాపులో గుమాస్తా. కొద్దిరోజులుగా నమ్మకంగానే ఉన్నాడు. యజమానులు అప్పగించిన పనిని చెప్పినట్టే చేసేవాడు. దీంతో వారికి అతనిపై నమ్మకం కుదిరింది. కానీ అదును కోసం ఎదురుచూస్తున్న అతను సమయం దొరక్కగానే తన పని కానిచ్చేశాడు. తన మీదికి నేరం రావొద్దని కట్టుకథ అల్లాడు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టైల్​లో విచారిస్తే నిజాలన్నీ బయటపడ్డాయి. సినిమా తరహాలో జరిగిన ఈ రాబరీ తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు తాడేపల్లిగూడెం పట్టణంలో బంగారం శుద్ధి వ్యాపారం చేస్తుంటారు. వీరి వద్ద అమర్​ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. తమ షాపులో బంగారం శుద్ధి చేసే యంత్రం పాడైపోవడం వల్ల తమ దగ్గర ఉన్న బంగారం రాజమహేంద్రవరంలోని ఓ షాపులో శుద్ధి చేయించేందుకు నిర్ణయించారు. గతంలో ఇలాంటి పనులు అమర్​కు అప్పగిస్తే నమ్మకంగా చేశాడు. దీంతో ఈసారి సైతం అమర్​కే 289 గ్రాముల బంగారం, ఆరు లక్షల 30 వేల నగదు ఇచ్చి రాజమహేంద్రవరం పంపించారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.

క్రికెట్​ బెట్టింగ్​, ఇతర వ్యసనాల కారణంగా అమర్​ అప్పుల పాలయ్యాడు. గతంలోనూ రాజమహేంద్రవరం వెళ్లి బంగారం శుద్ధి చేయించేందుకు వెళ్లిన సమయంలో అమర్​ మనసులో ఓ ప్లాన్​ తట్టింది. ఆ బంగారాన్ని ఎలాగైనా కొట్టేసి తన అప్పులు తీర్చుకోవాలని పథకం రచించాడు. అయితే బంగారం ఎత్తుకెళ్తే ఎలాగైనా దొరికిపోతానని, అలా దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించాడు. అందుకే దోపిడీ పథకం రూపొందించాడు.

ఈ నెల 13వ తేదీన వ్యాపారులు బంగారం శుద్ధి చేయించేందుకు అమర్​కు ఇవ్వగా ఈ ప్లాన్​ అమలు చేశాడు. 14వ తేదీ ఉదయం తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా శెట్టిపేట వద్ద నలుగురు వ్యక్తులు కత్తితో బెదిరించి బంగారం అపహరించారని యజమానికి సమాచారమిచ్చాడు. దీంతో యజమాని నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అమర్​ అనుమానాస్పదంగా ఉండడం గమనించారు. అమర్​ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్​లో విచారిస్తే దోపిడీ ప్లాన్​ బట్టబయలైంది.

వ్యసనాలకు బానిసైన అమర్​ ఎలాగైనా బంగారం కొట్టేయాలని ఆలోచించాడు. ఇందుకోసం దోపిడీ ప్లాన్​ చేశాడు. తనపైనే ఎవరూ దాడి చేయకుండానే చేశాడని యజమనాకి చెప్పాడు. అమర్​ మాటలపై అనుమానం వచ్చి విచారించాం. తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అమర్​ నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నాం. కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించాం. -పి.వి.జి. తిలక్​, నిడదవోలు సీఐ

కష్టపడి పని చేసి సంపాదించి అప్పులు తీర్చుకోవాల్సింది పోయి అత్యాశకు పోయి దోపిడీకి పాల్పడ్డాడు. చివరకు కటకటాల పాలయ్యాడని పోలీసులు తెలిపారు.

'జులాయి' సినిమాను తలపించేలా! - SBIలో భారీ దోపిడీ

గతంలో ట్రాన్సుపోర్టు అధికారి ఇప్పుడు దొంగ - ₹40లక్షలు చోరీ 42 గంటల్లోపే!

Last Updated : Nov 20, 2024, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.