AP High Court on Guntur Mayor : గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నగర మొదటి పౌరుడు మాట్లాడేది అలాగేనా, బాధ్యత ఉండాలి కదా? అని నిలదీసింది. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా? అని ప్రశ్నించింది. అసభ్య భాషను ఉపయోగిస్తే ఏ పార్టీ వారినైనా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది.
సేవ చేసి ప్రజలకు దగ్గరవ్వాలికాని, అసభ్యకర భాషతో కాదని హైకోర్టు హితవుపలికింది. బాధ్యతగా మెలిగేలా ఉండమని చెప్పాలని ఆయన తరఫు న్యాయవాదికి సూచించింది. మనోహర్ నాయుడికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది. కాగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌ను అవమానించేలా మాట్లాడటంపై అరండల్ పేట పోలీసు స్టేషన్లో మనోహర్ నాయుడిపై కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలంటూ మనోహర్ నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.
బంద్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేత జులుం.. జనసేన, ఎమ్మార్పీఎస్ నేతలను తరిమి కొట్టిన వైనం