How to Control Sugar Level : భోజనం చేసిన తర్వాత అంటే దాదాపు ఐదారు నిమిషాల్లోనే జీర్ణాశయం గ్లూకాన్ లైక్ పెప్టయిడ్-1(GLP-1) అనే హార్మోన్ స్రవిస్తుంది. అది ఆహారం నుంచి ఎక్కువ గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయకుండా కాలేయాన్ని నియంత్రిస్తుంది. కాలేయం ఉత్పత్తి చేసిన గ్లూకోజ్ రక్తంలో మరీ ఎక్కువగా చేరకుండా ఇన్సులిన్ విడుదల చేయాలని పాంక్రియాస్ (క్లోమగ్రంథి)ని జీఎల్‌పీ హార్మోన్ ఆదేశిస్తుంది. ఇది అంతటితో ఆగకుండా "కడుపు నిండిపోయింది, ఇంకేమీ తినలేం" అనే పరిస్థితిని కలిగిస్తుందట. ఇలాంటి ఎన్నో కీలక పనులు చేసే ‘జీఎల్‌పీ-1’ హార్మోన్ స్రావం మందగించడం వల్లే మధుమేహం (Diabetes) వస్తుంది. మధుమేహం సమస్యపై ఇప్పుడు వాడుతున్న మందులు జీఎల్‌పీ-1 చేయాల్సిన పనుల్ని కృత్రిమంగా చేస్తాయని, ఆ మందులతో పనిలేకుండా జీఎల్‌పీ-1 ప్రక్రియని సహజంగా పెంచే అవకాశంపై శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి

మధుమేహం కారణాలు, మందులు తదితర అంశాలపై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా చైనాలోని జియాంగ్నాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందడుగు వేశారు. జీఎల్‌పీ-1 హార్మోన్‌కీ జీర్ణవ్యవస్థలో ఉన్న బి.వల్గటాస్ అన్న బ్యాక్టీరియాకీ సంబంధం ఉందని కనుగొన్నారు. బి.వల్గటాస్ బ్యాక్టీరియా ఉన్న వాళ్లలో షుగర్ లెవల్స్ అదుపులో ఉన్నట్లు గమనించారు. (పరిశోధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ నేపథ్యంలో బి.వల్గటాస్‌ని సహజంగా పెంచడం ఎలా అని పరిశోధించిన శాస్త్రవేత్తలు ఎఫ్-ఫార్4 (FFAR4) అనే ప్రొటీన్‌తో ఇవి పెరుగుతున్నట్టు గమనించారు. ఈ ప్రొటీన్‌ని ఆహారంలో పెంచుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచడమే కాదు తగ్గించొచ్చని చెబుతున్నారు.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ విస్తరిస్తోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డారంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఈ వ్యాధి బారిన పడకూడదని అందరూ కోరుకుంటారు. అయితే డయాబెటిస్ టైప్ 1, టైప్ 2 అని రెండు రకాలుగా ఉంటుంది.
టైప్ 1 డయాబెటిస్ అంటే శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం, లేదా కాకపోవడమే. ఇన్సులిన్ హార్మోన్ తయారయ్యే పాంక్రియాస్లో కణాలు దెబ్బతింటాయి. ఇది సహజంగా పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉన్న వారు రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు. పాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేస్తున్నా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే పరిస్థితి ఉండదు. ఈ రకమైన వ్యాధి అధిక బరువు, ఊబకాయం, వంశపారంపర్యంగా వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు ఉన్నవారిలో ఈ రకం మధుమేహం లక్షణాలు కనిపిస్తాయి.

టైప్ 1, 2 డయాబెటిస్తో పాటు జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, మోనోజెనిక్ మధుమేహం వంటి పలు రకాలు ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. షుగర్ వ్యాధిలో చాలా రకాలుంటాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్((NIDDK) నివేదిక వెల్లడించింది. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఆకు రోజుకొక్కటి చాలు - ఎన్నో సమస్యలకు చెక్ పెట్టినట్లే!
'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు