ETV Bharat / state

ఫ్రీ చికెన్​ ఫుడ్​ మేళా - బారులు తీరిన జనం - CHICKEN MELA IN ELURU

పౌల్ట్రీ ఫామ్స్ ఆధ్వర్యంలో చికెన్ ఫుడ్ మేళా - భారీగా తరలివచ్చిన జనం

Chicken Mela in Eluru
Chicken Mela in Eluru (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2025, 10:10 PM IST

Chicken Mela in Eluru : బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీనిపై ఉన్న అపోహలు, వాస్తవాలను చెప్పేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, పౌల్ట్రీ ఫెడరేషన్ నిర్ణయించాయి. ఈ క్రమంలోనే చికెన్ ఫుడ్ మేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బిర్యానీతో పాటు చికెన్, గుడ్లతో తయారైన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ ఏలూరులో పౌల్ట్రీ ఫామ్స్ ​, చికెన్ దుకాణాల యాజమాన్యం, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చికెన్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చికెన్, గుడ్లతో తయారైన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. పౌల్ట్రీ యాజమానులు, అధికారులు మాంసహార వంటకాలను తిని ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.

చికెన్ , గుడ్లు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్పారు. అందులోని ప్రోటీన్లు, పోషకాహారం సమృద్ధిగా ఉంటాయని పేర్కొన్నారు. మేళాలో ఏర్పాటు చేసిన వంటకాలను రుచిచూడటానికి మాంసాహార ప్రియులు బారులు తీరారు. వివిధ రకాల చికెన్ వంటకాలను ఆరగించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.గోవిందరాజు, పౌల్ట్రీ, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

ఉచిత చికెన్​ ఫుడ్​ మేళా - బారులు తీరిన జనం - గేట్లు మూసివేత

సూపర్​ టేస్టీ "ఉలవచారు చికెన్​ లాలీపాప్స్​" - ఈ పద్ధతిలో చేస్తే ఒక్కటీ మిగలదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.