ETV Bharat / offbeat

కొనే పనిలేకుండా ఇంట్లోనే "దోశ మిక్స్‌ పౌడర్‌"! - కేవలం 5 నిమిషాల్లోనే వేడివేడి దోశ రెడీ! - DOSA PREMIX POWDER

ఈ సీక్రెట్స్​ తెలిస్తే మీరే ఇంట్లో దోశ మిక్స్​ పౌడర్ చేసుకోవచ్చు!

Dosa Premix Powder Recipe
Dosa Premix Powder Recipe (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 4:45 PM IST

Dosa Premix Powder Recipe: ప్రస్తుత కాలంలో మార్కెట్లో ఇడ్లీ, దోశ, వడ మిక్స్​ పౌడర్స్​ చాలా లభిస్తున్నాయి. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఎక్కువ టైమ్​లేని చాలా మంది వీటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. అయితే, కొన్ని టిప్స్​ పాటిస్తూ చేస్తే బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే దోశ మిక్స్​ పౌడర్​​ ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ మిక్స్ పౌడర్​​ సింపుల్​గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ స్టోరీలో చెప్పిన కొలతలతో దోశ మిక్స్​ పౌడర్​ రెడీ చేసుకుంటే ఎప్పుడైనా కమ్మటి దోశలను తయారు చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా దోశ మిక్స్​ పౌడర్​ ఎలా చేయాలో మీరు కూడా తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - అరకేజీ
  • మినప్పప్పు - పావుకేజీ
  • అటుకులు - పావు కప్పు
  • పచ్చిశనగపప్పు - పావు కప్పు
  • మెంతులు - టేబుల్​స్పూన్​

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టవ్​పై కడాయి పెట్టుకొని మినప్పప్పు వేసి కాసేపు వేపుకోవాలి. మినప్పప్పు రంగు మారకుండానే వేపి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఆపై అదే పాన్​లో బియ్యం వేసి వేపుకోండి. బియ్యం కూడా రంగు మారకుండానే కాసేపు వేపి పక్కనకు తీసుకోవాలి.
  • అదే పాన్​లో పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం అటుకులు, మెంతులు వేసి వేపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చుకున్న మినప్పప్పు, అటుకులు, బియ్యం మిశ్రమం వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • గ్రైండ్​ చేసుకున్న పిండిని ఒకసారి జల్లించి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే దోశ మిక్స్​ పౌడర్​ మెత్తగా వస్తుంది.
  • ఈ దోశ మిక్స్​ పౌడర్​ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్​టైట్​ కంటైనర్​లో స్టోర్​ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.
  • ఈ దోశ మిక్స్​ పౌడర్​తో మీరు పిండి పులియబెట్టి, అలాగే ఇన్​స్టంట్​గానూ దోశలు వేసుకోవచ్చు.
  • ఇక మీరు ఎప్పుడైన దోశలు వేసుకోవాలనుకుంటే అప్పుడు ఒక మిక్సింగ్​ బౌల్​లో రెండు కప్పుల దోశ మిక్స్, కొద్దిగా వంటసోడా, ఉప్పు, సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటే దోశ బ్యాటర్​ రెడీ అయిపోతుంది.
  • ఈ పిండితో మీరు క్రిస్పీగా దోశలు రెడీ చేసుకోవచ్చు.
  • అలాగే మీరు ఈ పిండిని కలిపి రాత్రంతా పులియబెట్టి కూడా ఉదయాన్నే దోశలు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే వంట సోడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
  • అంతే ఈ దోశ మిక్స్​ పౌడర్​ ఉంటే క్షణాల్లోనే క్రిస్పీ దోశలు రెడీ!
  • మరి దోశ మిక్స్​ పౌడర్​ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో చేసుకోండి!

రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!

"బొంబాయి రవ్వతో గుంత పొంగనాలు" - ఇంట్లో ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.