A Woman Dies On Burnt in Vaggampalli Of Prakasam District : ప్రకాశం జిల్లా పామూరు మండలం వెగ్గంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఆరుబయట నిద్రించిన ఓ మహిళ తెల్లారేసరికి కాలి బూడిదైంది. ఎస్సీ కాలనీకి చెందిన 53 ఏళ్ల ప్రేమమ్మ శుక్రవారం రాత్రి ఆరుబయట మంచంపై నిద్రించింది. ఉదయం చూసేసరికి కాలి బూడిదై కనిపించిందంటూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కక్షపూరితంగా ఎవరైనా ఘాతుకానికి ఒడిగట్టరా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రేమమ్మ నిద్రించిన మంచం పక్కనే ఉన్న వంట సామగ్రి కూడా కాలిపోయాయి.
సాధువుకు నిప్పంటించిన దుండగులు- ఊపిరాడక నిద్రలోనే ఐదుగురు మృతి
హోటల్‌లో పేలిన కుక్కర్ - మంటలు చెలరేగి యువతి సజీవ దహనం - FIRE ACCIDENT IN HOTEL