Trump and Musk Watch SpaceX Rocket Launch: యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధం మరింత బలపడింది. ఈ క్రమంలో వారిద్దరూ స్పేస్ఎక్స్కు చెందిన భారీ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే ఇందులో ఒక దశ విఫలం కాగా.. రెండో దశ విజయవంతమయింది.
స్పేస్‌ఎక్స్ ప్రయోగం లక్ష్యం ఏంటి?: స్పేస్‌ఎక్స్ మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) టెక్సాస్‌లో సుమారు 400 అడుగుల ఎత్తైన భారీ రాకెట్‌ను ప్రయోగించింది. చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్లేందుకు, మార్స్‌కు ఫెర్రీ క్రూను చేర్చేందుకు ఈ రాకెట్‌ను రూపొందించారు. ప్రణాళిక ప్రకారం రాకెట్‌లోని బూస్టర్ భూమికి తిరిగి వస్తే, లాంచ్‌ప్యాడ్‌లోని మెకానికల్ ఆర్మ్స్ దాన్ని పట్టుకోవాలి. అయితే తాజా ప్రయోగంలో ఈ దశ విఫలమైంది.
With data and flight learnings as our primary payload, Starship’s sixth flight test once again delivered → https://t.co/oIFc3u9laE pic.twitter.com/O6ZKThQRr6
— SpaceX (@SpaceX) November 20, 2024
సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్ ప్రయోగించిన 4 నిమిషాలకే 'బూస్టర్ క్యాచ్' ప్రక్రియను నిలిపివేశారు. దీంతో మరో బూస్టర్ 3 నిమిషాల తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కుప్పకూలింది. అదే సమయంలో పరీక్ష కోసం ఉపయోగించిన ఖాళీ స్టార్‌షిప్ క్యారియర్ దాదాపు 90 నిమిషాల పాటు భూమి చుట్టూ తిరుగుతూ హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఫుటేజీని స్పేస్‌ఎక్స్ తమ సోషల్ నెట్‌వర్క్‌లో షేర్ చేసింది.
ఈ ప్రయోగానికి ముందు స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "నేను గ్రేట్ స్టేట్ టెక్సాస్‌లో స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ప్రయోగాన్ని చూడబోతున్నాను. మస్క్‌కు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా" అని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ కుమారుడితో పాటు పలువురు రిపబ్లికన్ నేతలు కూడా ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
Successful ocean landing of Starship!
— Elon Musk (@elonmusk) November 20, 2024
We will do one more ocean landing of the ship. If that goes well, then SpaceX will attempt to catch the ship with the tower. https://t.co/osFud7XXPo
గత నెలలో స్పేస్‌ఎక్స్ భారీ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ స్టార్‌షిప్ నింగిలోకి దూసుకెళ్లడంతో పాటు లాంచ్‌ప్యాడ్ వద్దకు సురక్షితంగా చేరుకుంది. దీంతో ఇది ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఎలోన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ గెలుపు కోసం భారీగా విరాళాలు ఇచ్చి మద్దతు పలికారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ తన కార్యవర్గంలో మస్క్‌కు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీఓఎస్) జాయింట్ హెడ్‌లుగా మస్క్, వివేక్ రామస్వామి నియమితులయ్యారు.
ఇండియాకు చెందిన శాటిలైట్‌ని ప్రయోగించిన స్పేస్‌ఎక్స్- ఇస్రో ఎందుకు లాంచ్ చేయలేదు? రీజన్ ఇదే!
పినాకా రాకెట్ లాంచర్ టెస్ట్ సక్సెస్- దీంతో ఇండియన్ ఆర్మీ ఫైర్‌పవర్ డబుల్!- DRDO ఖాతాలో మరో విజయం