ETV Bharat / state

పందుల తరలింపులో ఉద్రిక్తత - వాహనానికి నిప్పు - ARGUMENT OVER PIGS RELOCATION

పట్టణంలో సంచరిస్తున్న పందులను బంధించిన నగర పంచాయతీ సిబ్బంది - తరలిస్తున్న వాహనంపై పందుల యజమానుల దాడి

argument_over_pigs_relocation
argument_over_pigs_relocation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 5:15 PM IST

Locals Clash with Panchayat Staff Over Pigs Relocation: వైయస్సార్ కడప జిల్లాలో పందులు పట్టుకునే విషయమై పంచాయతీ సిబ్బంది, స్థానికులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ వాహనం ధ్వంసం కాగా స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. పందులు ఉన్న వాహనాన్ని పోలీసు స్టేషన్​కు తరలించారు. అసలు అక్కడ ఏమైందంటే.

జిల్లాలోని జమ్మలమడుగులో గత కొద్ది రోజులుగా స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డి​కి పట్టణ శుభ్రతపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నగర పంచాయతీ సిబ్బంది పట్టణంలో క్లీనింగ్ పనులు చేపట్టారు. అయితే అక్కడే కొంత మంది స్థానికులు పందులు పెంచుకుంటున్నారు. ఆ పందులు పట్టణంలో సంచరించడంతో రోగాలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై కూడా ఫిర్యాదులు అందాయి.

దీంతో నగర కమిషనర్ వెంకటరామిరెడ్డి​​ ఆ పందుల యజమానులకు పందులను పట్టణంలోకి వదలకూడదని నోటీసులు ఇచ్చారు. అవసరం అయితే పందులు పెంచుకునేలా ఉరి చివరన అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పందుల యజమానులు పట్టించుకోలేదు. దీంతో నగర కమిషనర్ వారికి రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా వారు పట్టించుకోకుండా పందులను అలానే పట్టణంలోకి వదులుతున్నారు.

పెంపుడు కుక్కను అలా బయటకు తీసుకెళ్తున్నారా? - ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉండండి!

ఈ క్రమంలో రంగంలోకి దిగిన నగర పంచాయతీ సిబ్బంది పోలీసుల ఆధ్వర్యంలో పందులను పట్టుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. పట్టణంలో సంచరిస్తున్న పందులను పట్టుకుని వాహనంలో ఎక్కించారు. ఈ పట్టుకున్న పందులను తరలించే క్రమంలో పందుల యజమానులు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు నగర పంచాయతీ సిబ్బంది, పోలీసులతో వారికి వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన పందుల యజమానులు వాహనంపై రాళ్లతో దాడి చేసి వాహన అద్దాలను పగలకొట్టారు. వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వాహనం ధ్వంసం కాగా డ్రైవర్​ గాయపడ్డాడు. పరిస్థితి చేజారడంతో సీఐ గోపాల్ రెడ్డి, ఎస్సై రామకృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పందుల యజమానులను చెదరగొట్టి వాహనాన్ని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఆశ చూపారు, యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు- కోటి రూపాయలు కొట్టేశారు

ఆవాసం కరువై జనావాసాల్లో వన్యమృగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.