CII Representatives on Union Budget 2025: పేదలు, మధ్యతరగతి ప్రజలు, పరిశ్రమలకు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే కలల బడ్జెట్‌ను కేంద్రం రూపొందించిందని పారిశ్రామిక, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2025-26పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో లైవ్ వ్యూయింగ్ సెషన్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన సమావేశానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలు, పరిశ్రమలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని విజయవాడ జోన్ సీఐఐ చైర్మన్ రవీంద్ర నాధ్, ఏపీ మాజీ సీఐఐ చైర్మన్ రామకృష్ణ తెలిపారు.
దీర్ఘ ఫలాలు వచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేశారని, అందుకే బడ్జెట్‌లో అన్ని రంగాలకు పెద్ద పీట వేశారని వివరించారు. బడ్జెట్ ద్వారా అన్నదాతలకు మేలు జరగనుందని వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచడం, స్టార్టప్‌లకు రూ.10 కోట్లు నుంచి రూ.20 కోట్లకు పెంచడం శుభపరిణామమన్నారు. నగరాల అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఆర్థిక మంత్రి ప్రకటించడంతో విజయవాడ నగరం మరింత ప్రగతి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెనకబడిన జిల్లాల రైతులను ప్రోత్సహించేలా బడ్జెట్: పవన్ కల్యాణ్
వైద్యవిద్య చవాలనుకునే ఆశావహులకు మంత్రి సీతారామన్ మెడికల్ సీట్లు మరో 75 వేలకు పెంచుతున్నామని అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, కృష్ణా జిల్లాలోని పింగళి వెంకయ్య వైద్య కళాశాలున్నాయి. వీటిల్లో మరిన్ని సీట్లు కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలకు టర్మ్‌లోన్ పథకం ద్వారా రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. కానీ తాజా బడ్జెట్‌లో ప్రత్యేకంగా రాష్ట్రానికి నిధులు కేటాయించకపోడం లోటుగానే పరిగణించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆర్థిక వృద్ధిలో కీలకమయిన వ్యవసాయ రంగానికి మంత్రి సీతారామన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం ధన ధాన్య కృషి యోజన అమలు చేయనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 70 శాతం మంది అన్నదాతలకు లబ్ధి చేకూరనుంది. అలాగే మత్స్య, పశుసంవర్థక శాక రంగాల్లో రైతులకు కూడా స్వల్పకాలిక రుణం పొందవచ్చు.
బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతూ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తుంది. కృష్ణా, ఎన్టీఆర్‌లో డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తూ ప్రాధాన్యం ఇస్తుంది. కూటమి ప్రభుత్వం పెంచిన రుణంతో ఎంఎస్‌ఎంఈలకు మరింత లబ్ధి చేకూరనుంది. విద్యారంగంలో అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందిస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 29 అటల్ థింకరింగ్ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువకులకు సృజన, నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు అందించనున్నాయి.
కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి నిధులు - ఏపీకి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే?
'వికసిత్ భారత్ దార్శనికతకు ప్రతిబింబం' - నిర్మలమ్మ బడ్జెట్‌పై చంద్రబాబు స్పందన