హ్యాపీ బర్త్​డే మోదీ.. చాయ్​ కప్పులతో సైకతశిల్పం.. ఆ వీరాభిమాని 8 ఏళ్లుగా.. - narendra modi AGE

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 17, 2022, 11:15 AM IST

Modi Birthday Wishes : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​. 1213 మట్టి టీకప్పులను ఉపయోగించి మధ్యలో మోదీ చిత్రంతో ఒడిశా పూరీ బీచ్​లో సైకత శిల్పం రూపొందించారు. అందులో హ్యాపీ బర్త్​డే మోదీ అని రాసుకొచ్చారు. ఈ 5 ఫీట్ల పొడవున్న ఆకృతి కోసం పట్నాయక్​ 5 టన్నుల ఇసుక వాడారు. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని మోదీ వీరాభిమాని విజయ్​ గుప్తా.. ప్రధాని జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నాడు. గత 8 ఏళ్లుగా ప్రధాని చేసిన అభివృద్ధి పనులు, విదేశీ పర్యటనలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పేపర్​ కటింగ్​లను తన పాన్​ షాపులో అతికించుకోవడం విశేషం. ఇదిప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ప్రధాని 72వ జన్మదినం సందర్భంగా.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.