ముఖ్యమంత్రిపై ఎద్దు దాడి.. లక్కీగా.. - Basavaraj Bommai escapes
🎬 Watch Now: Feature Video
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు ప్రమాదం తప్పింది. తాలికోట్ తాలూకాలోని బంటనూర్ గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్థానిక రైతు ఓ ఎద్దును విరాళంగా ఇచ్చారు. ఎద్దుకు సీఎం బసవరాజ్ బొమ్మై పూజలు చేస్తూ దానిపై చేయి వేశారు. అది ముందుకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అక్కడ ఉన్న రైతు ఆ ఎద్దును అదుపు చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Last Updated : Apr 27, 2022, 2:49 PM IST