ప్రిన్సిపల్‌కు ఎమ్మెల్యే చెంప దెబ్బ.. నెటిజన్లు ఫైర్ - కర్ణాటక మండ్య ఎమ్మెల్యే
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని జేడీఎస్ ఎమ్మెల్యే ఎం. శ్రీనివాస్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆయన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు మండ్యలోని ఐటీఐ కాలేజ్‌కు వచ్చారు. అనంతరం కాలేజీ గురించి వివరాలు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐటీఐ ప్రిన్సిపల్‌పై దాడికి పాల్పడ్డారు. సహోద్యోగుల ఎదుటే ప్రిన్సిపల్‌ను రెండు చెంపదెబ్బలు కొట్టారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. శ్రీనివాస్ 2018వ సంవత్సరంలో మండ్య నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.