రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. డ్రైవర్ పరార్.. బాధితుడు అక్కిడక్కడే.. - హిట్ అండ్ రన్ కేసు జబల్పుర్
🎬 Watch Now: Feature Video
Hit And Run Case: మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కానీ, డ్రైవర్ మాత్రం కారుని ఆపకుండా అతివేగంతో వెళ్లిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు.. కారును వెంబడించారు. కానీ, అతడు చిక్కలేదు. మృతుడ్ని సంతోశ్ ఠాకూర్(45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఘటనాస్థలి సమీపంలో సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నారు.